భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలు విలవిల
దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. లోతట్టు ప్రాంతాలకు వరద నీరు చేరుకుంటుంది. నదులు , కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. జలాశయాల్లో నీరు అధిక మట్టానికి చేరుకుంటుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. విశాఖ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వర్షాల కారణంగా విద్యాలయాలకు ముదస్తు సెలవు ప్రకటించారు. అనకాపల్లి, బిఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలు రెడ్ అలర్ట్ ప్రకటించారు.
తెలంగాణలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు ఇండ్ల నుండి బయటకు రాలేకపోతున్నారు. గత మూడు రోజులుగా విద్యాలయాలకు సెలవులు ఉన్నాయి. సోమవారం నుండి తెలంగాణలో రానున్న రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్‌ను ప్రకటించింది. పలుచోట్ల రహదారులు తెగిపోయి రాకపోకలకు అంతరాయం కలుగుతుంది.


Also Read: ఎన్‌డిఎ ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఖరారు


[…] […]