కామారెడ్డి: కలెక్టరేట్‌లో మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

కామారెడ్డి (CLiC2NEWS): జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘ‌నంగా నిర్వ‌హించారు. సావిత్రి బాయి పూలే జన్మదినం సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ జ్యోతి ప్రజ్వలన గావించి సావిత్రి బాయి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..

భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సామాజిక సంస్కర్త సావిత్రి బాయి ఫూలే జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలను నిర్వహించడం జరిగిందన్నారు. సావిత్రి బాయి ఫూలే మహిళా విద్యకు నాంది పలికిన మహోన్నత వ్యక్తి అని, కుల వివక్ష, లింగ వివక్షలను ఎదుర్కొని బాలికల విద్య కోసం అహర్నిశలు శ్రమించారని పేర్కొన్నారు. మహిళలు చదువుకుంటే సమాజం ముందుకు సాగుతుందన్న దృఢ నమ్మకంతో ఆమె చేపట్టిన ఉద్యమం నేటి తరం మహిళలకు ఆదర్శమని తెలిపారు. సావిత్రి బాయి ఫూలే విద్యా రంగంలో చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆమె బాటలో నడుస్తూ మహిళా ఉపాధ్యాయులు.. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అనంతరం మహిళా ఉపాధ్యాయులను శాలువాతో స‌త్క‌రించి, జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రాజు, అధికారులు, మహిళా ఉపాధ్యాయులు, విద్యా శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

కొండ‌గ‌ట్టు అంజ‌న్న‌ను ద‌ర్శించుకొన్న ప‌వ‌న్‌

Leave A Reply

Your email address will not be published.