Kamareddy: ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు
కామారెడ్డి (CLiC2NEWS) : భారతీయ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, మహిళల విద్యా కోసం ఎంతో కృషి చేసిన మహా వీర వనిత సావిత్రి బాయి పూలే జయంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ ఆఫీస్ వద్ద జాతీయ బిసి సంక్షేమ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. మహాత్మ జ్యోతిబా పూలే, సావిత్రి బాయి పూలే త్యాగాలు స్మరించుకుని, వారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకుందామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, బిసి అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాముని సుదర్శన్ నేత, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతల శంకర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు సునీత, జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెర రాజయ్య, జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ రాజేందర్, జిల్లా మహిళా కార్యదర్శి లావణ్య, యువజన విభాగం జిల్లా ఇంచార్జీ శ్రావణ్ కుమార్ గౌడ్, రాజంపేట మండలం ఇంచార్జీ మురళి, కామారెడ్డి పట్టణ అధ్యక్షుడు హరినాథ్ ఆర్య, ఉపాధ్యక్షుడు సంగ గౌడ్, కార్యదర్శి దినేశ్, సహాయ కార్యదర్శి పెంటయ్య, యూత్ కార్యదర్శి మహేష్ బాబు యువకులు తదితరులు పాల్గొన్నారు.
[…] Kamareddy: ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వే… […]