కొండగట్టు అంజన్నను దర్శించుకొన్న పవన్
పలు అభివృద్ధిపనులకు భూమి పూజ చేసిన పవర్‌స్ఠార్
కొండగట్టు (CLiC2NEWS) కొండగట్టు అంజన్నను శనివారం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం కొణిదల పవన్ కల్యాణ్ దర్శించుకున్నారు. ఈ పర్యటనలో ఆయన వెంట తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం రూ. 35.19 కోట్ల తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో భక్తుల వసతి కోసం 96 గదుల ధర్మశాల, దీక్ష విరమణ మండప నిర్మాణానికి పవన్ కల్యాణ్ భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సిఎం పవన్ మాట్లాడుతూ… కొండగట్టు అంజన్న సన్నిధిలో అభివృద్ధిపనులు ప్రారంభిస్తున్నామంటే దేవుడి దయ ఉండాలని అన్నారు. కొండగట్టు అంజన్న నాకు పునర్జన్మను ఇచ్చారని తెలిపారు. గతంలో జరిగిన విద్యుత్ ప్రమాదం నుంచి నేను ఎలా బయటపడ్డానో ఇప్పటికీ ఆశ్చర్యం కలిగిస్తుందని పవన్ అన్నారు. ఇంతకు ముందు నేను ఇక్కడికి వచ్చినప్పుడు దీక్ష విరమణకు మండపం, సత్రం కావాలని నన్ను కోరారు. అది టిటిడి సభ్యులు, తెలంగాణ నాయకులు, అందరి కృషితోనే సాధ్యమైందని తెలిపారు. కాగా పవన్ పర్యటన నేపథ్యంలో భారీ సంఖ్యలో అభిమాను కొండగట్టుకు చేరుకున్నారు. సందర్భంగా తెలంగాణ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీ గా అభిమానులు తరలిరావడంతో కొండగట్టులో విపరీతమైన రద్దీ నెలకొంది.
Also Read: మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

[…] […]