హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం కాకుండా అడ్డుకుంటాం: కెటిఆర్
హైదరాబాద్ (CLiC2NEWS): ఉమ్మడి రాజధాని, కేంద్రపాలిత ప్రాంతం కాకుండా, రాజ్యాంగం మార్చకుండా అడ్డుకొనే శక్తి బిఆర్ ఎస్కే ఉందని కెటిఆర్ అన్నారు. వేములవాడ లో నిర్వహించిన బూత్ కమిటి సభ్యుల సమావేశంలో కెటిఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ పుట్టుకను అవమానించిన మోడీ .. పదేళ్లలో ప్రజలను మోసం చేశారన్నారు. 2014లో బడాభాయి మోడీ .. జన్‌ధన్ ఖాతాలు తెరిస్తే ఒక్కొక్కరికి రూ. 15 లక్షలు ఖాతాలో వేస్తామని ఓట్లు దండుకున్నారని, 2024లో ఆరు గ్యారంటీలు ఇస్తామని చోటాభాయి రేవంత్ రెడ్డి మోసం చేశారన్నారు.
70 వయస్సులో తుంటి విరిగినా, కుమార్తె జైల్లో ఉన్నా.. నమ్మినవాళ్లు మోసం చేసి వేరే పార్టీలోకి వెళ్తున్నా.. కెసిఆర్ బస్సుయాత్ర చేస్తూ జనంలో తిరుగుతున్నారు. తల్లిలాంటి పార్టికి కష్టం వచ్చినప్పుడు పంచాయితీలు పక్కన పెట్టి ఎండను లెక్క చేయకుండా ముందుకు రావాలన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బిఆర్ ఎస్ 10 .. 12 సీట్లు వస్తే కెసిఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసించే రోజు ఏడాదిలోపే వస్తుందని కెటిఆర్ అన్నారు.