జగిత్యాల అగ్రికల్చరల్ కాలేజ్‌లో లెక్చరర్ పోస్టులు

జగిత్యాల (CLiC2NEWS): : జిల్లా పొలాసలోని అగ్రికల్చరల్ కళాశాలలో 9 టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అగ్రికల్చరల్ ఎకనామిక్స్, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్, పాథాలజి, యానిమల్ ప్రొడక్షన్, స్టాటిటిక్స్ అండ్ మ్యాథమెటిక్స్, హర్టికల్చర్, అగ్రోనమి, బయో కెమెస్ట్రి పోస్టులకు ఏప్రిల్ 3,4 తేదీల్లో ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో ఎమ్మెస్సి , ఎంటెక్, ఎంవిఎస్‌సి లేదా పిహెచ్డి ఉత్తీర్ణులై పని అనుభవం కూడా ఉండాలి. పుల్ టైమ్ అభ్యర్థులకు నెలకు రూ. 40,000.. పార్ట్‌టైం అభ్యర్థులకు నెలకు రూ. 35,000 జీతం అందుతుంది.