Mandapet: మహిళకు ఉచిత ‘ఎగ్ కార్ట్’ పంపిణీ
మండపేట (CLiC2NEWS): మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ‘ఎగ్ కార్ట్ (Egg Cart)’ వినూత్న పథకం చేపట్టిన విషయం తెలిసిందే. మండపేట మండలంలోని జెడ్ మేడపాడు గ్రామానికి చెందిన భీమన్న ఆదిలక్ష్మికి నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ సెర్ప్ (NECC) ద్వారా రూ.50,000 విలువ గల ఎగ్ కార్ట్ను ఉచితంగా అందజేశారు. టిడిపి కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు లబ్ధిదారునికి ‘ఎగ్ కార్ట్’ వాహనాన్ని అందజేశారు.
ఎపి ప్రభుత్వం మహిళలకు ఉచితంగా రూ.50వేలు విలువైన ‘ఎగ్ కార్ట్’ యూనిట్లను అందింస్తుంది. మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ వినూత్న ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి మంది మహిళలకు ఈ ఎగ్ కార్ట్ యూనిట్లు అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ యూనిట్ విలువ రూ.50వేలు. ఈ ఎగ్ కార్ట్ యూనిట్లో ఒక స్టాల్, గ్యాస్ పొయ్యి, వంట సామాగ్రి, పుడ్ ప్యాకింగ్ యంత్రాలు.. ఇలా వస్తువులన్నీ ఉచితంగా ఇస్తారు. దీని ద్వారా గుడ్డు తో తయారు చేసే అన్ని వంటకాలు రుచికరంగా , శుభ్రంగా తక్కువ ధరకే లభిస్తాయి. ఇది మహిళలకు స్వయం ఉపాధి కల్పిస్తూ.. మరోవైపు ప్రజలకు పోషకాహారాన్ని అందిస్తుంది.
కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్, కోలుపోటి సత్యనారాయణమూర్తి, ఎపి పౌల్ట్రీ పరిశ్రమల ప్రధాన కార్యదర్శి పడాల సుబ్బారెడ్డి, ఈదిపల్లి మంగరాజు, నూని వీర్రాజు, నెల్లిపూడి సత్యనారాయణ, నరిగిరి బాపయ్య, అధికారులు డిపిఎం ఆదియ్య, ఎపిఎం బి.విష్ణుమూర్తి, మహిళా సంఘం అధ్యక్షురాలు చుక్కన రాణి కుమారి, సిసిలు కెఎల్ వి ప్రసాద్, వేణు తదితరులు పాల్గొన్నారు.
[…] […]