జాతీయ జెండాల సరఫరాలో మండపేట పోస్టాఫీసు జిల్లాలో టాప్‌..

మండపేట (CLiC2NEWS): స్వ‌తంత్ర భార‌త వ‌జ్రోత్స‌వాల‌లో భాగంగా ప్రతీ ఇంటి మీద జెండా ఎగురవేసి దేశ భక్తిని చాటాలని దేశ‌ ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్ర‌తి ఒక్క‌రూ అమ‌లు చేశారు. జాతీయ జెండాలను అందరికీ అందించిన మండపేట పోస్టాఫీసు జిల్లాలో నెంబర్ వన్ గా నిలిచింది. మండపేట సబ్ పోస్ట్ మాస్టర్ ఎన్ శ్రీనివాస్ రెడ్డి, కొండపల్లి సూర్యనారాయణలు పంద్రాగస్టు వేడుకలకు వారం ముందు నుండి జెండాలు ముందుగానే స్టాకు పెట్టి కావలసిన వారందరికీ పంపిణీ చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన రూ 25 ల ధరకే  ఈ జెండాలు అందజేశారు. అన్ని పార్టీల రాజకీయ నాయకులను, పట్టణంలో ఉండే ప్రముఖులకు ఆహ్వానం పంపి తపాలా కార్యాలయంలో జెండాలు అందజేశారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు ప్రైవేట్ కార్యాలయాలకు వెళ్లి నేరుగా వారి చేతికి జెండాలను అందజేసి విశేష కృషి చేశారు. ఇలా ప్రతి ఒక్కరికీ పతాకాలను పంపిణీ చేయడంలో జిల్లాలోని అన్ని తపాలా కార్యాలయాలకంటే మండపేట పోస్టాఫీసు ముందు వరుసలో ఉంది. ప్ర‌జ‌లంద‌రూ పోస్టాఫీసు సిబ్బందిపై ప్ర‌శంస‌లజ‌ల్లులు కురుపిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.