Mandapeta: నాటి చీకటి రోజులకు 46 యేళ్లు..
మండపేట (CLiC2NEWS): ఇందిరాగాంధీ అరాచక పాలనతో యమర్జెన్సీ విధించిన సమయంలో తాము 11నెలలు జైలు జీవితం గడిపామని ఆర్ ఎస్ ఎస్, జన సంఘ్ నాయకులు వల్లూరి విజయానంద పార్థసారథి (నల్లబ్బాయి), విశ్వనాధుల వీర సత్యప్రసాద్ లు తెలిపారు. ఆ సమయంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం యమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన ఉద్యమ కారులను బీజేపీ జిల్లా ఉపాధ్యక్షడు కోన సత్యనారాయణ వారిని ఘనంగా సత్కరించారు. బీజేపీకార్యాలయంలో శుక్రవారం నల్లబ్బాయి, వీర సత్యప్రసాద్ లకు పూల దండలు, దుస్సాలువాలతో ఆయన ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. నేటికి యమర్జెన్సీ విధించి 46 యేళ్లు పూర్తి అయిందన్నారు. జూన్ 26 ప్రజాస్వామ్యంలో ఒక చీకటి దినమని అభివర్ణించారు.
స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఆనాటి ఇందిరా అరాచకపాలనను ఎన్నడూ చూడలేదని అన్నారు. ఇందిరా నిరంకుశత్వ పాలనకు యమర్జెన్సీయే ఒక నిదర్శనమని అన్నారు. అప్పటి రోజులను జ్ఞప్తికి తెచ్చుకొని ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు రామానుజం, ఆదినారాయణలు భరతమాత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టౌన్ ఉపాధ్యక్షుడు నాళం ఫణి ప్రకాష్, కపిలేశ్వరపురం మండలం అధ్యక్షుడు తోరం రాము, ఎం చక్రవర్తి, రామచంద్రపురం మాజీ అధ్యక్షుడు దూడల శంకర నారాయణ, జక్కా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.