Mandapeta: పోస్ట్ మాస్టర్ శ్రీనివాస్ రెడ్డికి అభినందనలు

మండపేట (CLiC2NEWS): మండపేట తపాలా కార్యాలయంలో ఇటీవల నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన పోస్ట్ మాస్టర్ నల్లమిల్లి శ్రీనివాస్ రెడ్డిని కార్యాలయ ఉద్యోగులు అభినందనలు తెలిపారు. సోమవారం తపాలా ఉద్యోగుల సంఘం నాయకులు కొండపల్లి సూర్య నారాయణ ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయనకు దుస్సాలువా కప్పి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. పోస్ట్ మాస్టర్ మాట్లాడుతూ గతంలో పని చేసిన పోస్ట్ మాస్టర్ లు మాదిరిగా పని చేస్తూ ప్రజలకు సేవ చేస్తానని అన్నారు. సిబ్బంది అధికారుల సమన్వయం తో మండపేట పోస్ట్ ఆఫీస్ ను అభివృద్ధి పథంలో నడిపించడానికి కృషి చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా కొండపల్లి సూర్య నారాయణ మాట్లాడుతూ పోస్ట్ ఆఫీస్ లో అధిక వడ్డీని ఇచ్చే పథకాలు అన్నీ ప్రజలు వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కె నాగ మోహన్ రావు, ఎం సుబ్బారావు, బి సీతామహాలక్ష్మి, కె ఈశ్వరరావు, కేఈ ప్రసాద్, ఎం సురేష్, బి గోవిందు, కె జానకి, జి వెంకట్రావు, ఎండీ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.