Mandapeta: `అన్ని హంగులతో వైఎస్ జగనన్న కాలనీ..`
చైర్ పర్సన్ పతివాడ దుర్గారాణి..
మండపేట (CLiC2NEWS): వేములపల్లిలో నిర్మితమవుతున్న వైఎస్ జగనన్న కాలనీకి సకల హంగులు ఏర్పాటు చేసి సుందర కాలనీగా రూపుదిద్దుతామని మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ దుర్గారాణి పేర్కొన్నారు. మండపేట 2 వ సచివాలయం పరిధిలో 7,8 వార్డు ల లబ్ధిదారులకు బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండపేట లో లబ్ధిదారులకు వేములపల్లి లో ఇళ్ల స్థలాలు మంజూరు అయ్యాయని అక్కడ లే అవుట్ లో త్వరగా ఇళ్ళు నిర్మించుకోవాలని కోరారు. 10 వేల కుటుంబలతో అక్కడ వేములపల్లి నగరం గా రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు. భవిష్యత్ లో అక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, రైతు బజార్లు అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి ప్రజలకు అందించడానికి సిద్ధం గా ఉన్నామన్నారు. గృహ రుణాలు కు సంబంధించిన వివరాలు ఏ ఈ గణేశ్వరరావు వివరించారు. మెప్మా రుణాలు పై మెప్మా టెక్నికిల్ ఎక్స్ పర్ట్ పణికుమార్ వివరాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి నల్లమిల్లి వీర్రెడ్డి, వైస్సార్ సిపి నాయకులు అధికారి శ్రీనివాస్,7,8 వార్డు కౌన్సిలర్ లు సవరపు సతీష్, మందపల్లి రవి కుమార్, 7 వ వార్డు వైఎస్సార్సీపీ ఇన్ చార్జ్ మందపల్లి రుద్రకాంత్, మెప్మా సి ఓ వరలక్ష్మి, సచివాలయం సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు.