Mandapeta: జన్మదిన వేడుకలు సందర్భంగా అన్నదానం

మండపేట (CLiC2NEWS): మండపేట రూరల్ మండలం వైఎస్సార్సీపీ నాయకుడు పలివెల సుధాకర్ జన్మదిన వేడుకలు ఏడిద గ్రామంలో ఘనంగా జరిగాయి. సోమవారం ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో కేక్ కటింగ్ ఏర్పాటు చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుధాకర్ పుట్టిన రోజును పురస్కరించుకొని గ్రామంలోను, మండపేట పట్టణంలో ఉండే అనేక మంది అనాథలకు అన్నదానం చేసారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ లాక్ డౌన్ తో ఉపాధి కరువై అలమటిస్తున్న నిరుపేదలకు ఆహారం అందించడం జరిగింది అన్నారు. పట్టణంలోని బస్ స్టాండ్, కలువ పువ్వు సెంటర్, రాజారత్న సెంటర్, రథం గుడి, మారేడుబాక జంక్షన్, .పెద్ద కాలువ వంతెన తదితర ప్రాంతాల్లో ఉండే అభాగ్యులకు ఆహారం పొట్లాలు పంచారు. రోడ్డు పక్కన ఫుట్ పాత్ లపై ఉన్న దాదాపు సుమారు 150 మంది పేదలకు ఆహార ప్యాకెట్లు అందజేశారు. కార్యక్రమంలో వైసీపీ యువజన విభాగం నాయకులు పైడిమళ్ల రాజు, పువ్వుల సుధాకర్, వి శ్రీనివాస్, ఎస్ జయ శేఖర్, కె నవ్య తేజ అశోక్, యు రమేష్, కె రామలింగేశ్వర రెడ్డి, ఎస్ సృజన్ తదితరులు పాల్గొన్నారు.