Mandapeta: నవ రత్నాలు పేదలకు వరం: మున్సిపల్ చైర్మన్ రాణి

మండపేట (CLiC2NEWS):ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నత ఆశయంతో శ్రీకారం చుట్టిన నవ రత్నాలు పథకం రాష్ట్ర ప్రజలకు ఒక వరం లాంటివి అని మండపేట మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ దుర్గారాణి పేర్కొన్నారు. సోమవారం రూరల్ మండలం వేములపల్లి లో పేదల ఇళ్ళ స్థలాల శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొని భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా 1వ సచివాలయం పరిధిలోని లబ్దిదారులకు అవగాహన కల్పించారు. నవ రత్నాలు పథకం ఎంతో ప్రతిష్టాత్మకమైనదని దీన్ని పేదలంతా సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ జగన్ కాలనీలో గృహాలను లబ్దిదారులు అంతా నిర్మించుకుని అద్దె ఇళ్ళ నుంచి విముక్తి పొందాలన్నారు. గృహ నిర్మాణాలకు ఆర్థిక తోడ్పాటు కోసం మెప్మా నుంచి కూడా కొంత రుణం మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సదస్సులో హౌసింగ్ ఏఈ గనేశ్వరరావు లబ్దిదారుల సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ లు పోతంశెట్టి ప్రసాద్ , చిట్టూరి సతీష్, మూడో వార్డు ఇన్ చార్జి, హౌసింగ్ సీఎల్టీసీ కె సూర్య ప్రకాష్, మెప్మా సిఈఓ వరలక్ష్మి, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.