Mandapeta: నూతన పన్ను విధానంపై అవగాహన..
పంచాయతీల ఆర్థిక పరిపుష్టికి కృషి.. జగనన్న సంకల్ప విజయవంతం చేయాలి.
మండపేట (CLiC2NEWS): పంచాయతీలలో ప్రభుత్వం నూతనంగా అమలు చేయనున్న ఆస్తి పన్ను విధానం పై స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం గ్రేడ్ ఫైవ్ పంచాయతీ కార్యదర్శులు, సచివాలయం పంచాయతీ కార్యదర్శిలు,డిజిటల్ ఆపరేటర్ లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో ఐదం రాజు మాట్లాడుతూ నూతన ఆస్తిపన్ను విధానానికి సంబంధించి ప్రొఫార్మా ప్రకారం పొందుపరిచిన అంశాలన్నింటినీ అసైన్మెంట్ లో క్రోడీకరించాలన్నారు.ఆయా ఆస్తి పన్నుకు సంబంధించిన వాస్తవిక విధానాన్ని నవీనికరించాలని పేర్కొన్నారు. ఆర్థిక పరిపుష్టి సాధన దిశగా పంచాయితీల్లో వనరుల అభివృద్ధికి దృష్టి సారించాలని సూచించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను చర్చించారు.కోవి షీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్న 84 రోజులు పూర్తయిన అందరికీ రెండవ విడత వ్యాక్సిన్ శనివారం వేయనున్నట్లు తెలిపారు. వచ్చేనెల 8న ప్రారంభం కానున్న వైయస్సార్ జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు,సిబ్బంది పాల్గొన్నారు.