mandapeta public school: ఘనంగా దీపావళి వేడుకలు..

మండపేట (CLiC2NEWS): అన్ని ప్రాంతాలవారు ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ దీపావళి వేడుక అని మండపేట పబ్లిక్ స్కూల్ విద్యాసంస్థల కరస్పాండెంట్ వల్లూరి చిన్నారావు పేర్కొన్నారు. గురువారం జరిగే దీపావళి వేడుకలను పురస్కరించుకుని ఎంపీఎస్ లో ముందస్తుగా వేడుకలు నిర్వహించారు. ఎంపీఎస్ ఆనవాయితీ ప్రకారం విద్యార్థినీ విద్యార్థులు పాఠశాలలో ఆనందంతో టపాసులు వెలిగించి సంబరాలు జరుపుకున్నారు. ప్రత్యేకంగా సిద్ధం చేసిన 20 అడుగుల నరకాసురుని విగ్రహాన్ని వెలిగించారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రంగవల్లుల మధ్య వెలిగించిన దీపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా కరస్పాండెంట్ చిన్నారావు మాట్లాడుతూ ప్రతి ఇంటా దీపావళి వేడుక ఆనందంగా జరుపుకోవాలని ఇప్పటి వరకూ ఉన్న చీకట్లను పారద్రోలి వెలుగులు ప్రసాదించాలని ఆకాంక్షించారు. దీపావళి పండుగ రోజున తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆయన వివరించారు. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వేడుక జరుపుకుని కాలుష్య రహిత సమాజ నిర్మాణానికి పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్కూల్ వ్యవస్థాపకులు వల్లూరి విజయానంద పార్ధసారధి(నల్లబ్బాయి),  జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ దేవళ్ళ సాయి గంగాధర్ , స్కూల్ ప్రిన్సిపాల్ గణేష్, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, సిబ్బంది , విద్యార్ధినీ విద్యార్ధులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.