ఢిల్లీలో ఐసిస్ ఉగ్రవాది అరెస్ట్!
![](https://clic2news.com/wp-content/uploads/2022/06/NATIONAL-INVESTIGATION-AGENCY.jpg)
ఢిల్లీ (CLiC2NEWS): దేశ రాజధానిలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మహమ్మద్ షానవాజ్ అలియాస్ షఫీ ఉజామాను ఆరెస్టు చేశారు. షానవాజ్ పుణె ఐసిస్ మాడ్యూల్ కేసులో కీలక నిందితుడు. జాతీయ దర్యాప్తు సంస్థ ఇప్పటికే అతడి ఆచూకీ తెలిపిన వారికి రూ.3 లక్షల రివార్డును సైతం ప్రకటించింది. ఇంతకు ముందు అరెస్టు్ చేసిన ఐసిస్ ఉగ్రవాది ఇచ్చిన సమాచారం ఆధారంగా షానవాజ్ను అరెస్టు చేసినట్లు సమాచారం. ఇతను పుణె పోలీస్ కస్టడీ నుండి తప్పించుకొని ఢిల్లీ ఉంటున్నాడు. ఢిల్లీలో ఉగ్రదాడులకు యత్నించినట్లు ఎన్ ఐఎ అధికారులు వెల్లడించారు. పుణె ఐసిసి మాడ్యూల్లో కీలక నిందితుడైన షానవాజ్ని ఢిల్లీ స్సెషల్ పోలీసులు, ఎన్ ఐఎ అధికారులు సమన్వయంతో పట్టుకున్నారు.