Mandapeta: మండపేటలో ఎంపి చింతా అనురాధ జన్మదిన వేడుకలు..

మండపేట (CLiC2NEWS): ఎంపి చింతా అనురాధ జన్మదినోత్సవ వేడుకలు మండపేట లో షేక్ అండ్ షేక్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ అలీ ఖాన్ బాబా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సోమవారం 28వ వార్డులో ఏర్పాటు చేసిన ఈ పుట్టినరోజు కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ దుర్గారాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
కేక్ కట్ చేసి హాజరైన కౌన్సిలర్ లకు కు వైసీపీ కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ దుర్గారాణి మాట్లాడుతూ అమలాపురం పార్లమెంటుకు ప్రాతినిధ్యం ఎంపీ చింతా అనురాధ భవిష్యత్తులో మరెన్నో పుట్టినరోజు కార్యక్రమాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఒక మహిళగా ఎంపీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న అనురాధ ఎన్నో బాధ్యతాయుతమైన కార్యక్రమాలు చేపడుతూ మహిళా లోకానికి ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. ఆమె భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఉన్నత పదవులు చేపట్టి మహిళాభ్యుదయానికి కృషి చేయాలని అన్నారు. మండపేట మున్సిపాలిటీకి కూడా తమ వంతు సహకారం అందించి నిధులు మంజూరు చేసి పురపాలక సంఘం అభివృద్ధికి చేయూత నివ్వాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్ లు మొండి భవానీ కిరణ్, పిల్లి శ్రీనివాస్, మారిశెట్టి సత్యనారాయణ, నీలం దుర్గమ్మ, శెట్టి కళ్యాణి, యన్నన ప్రభావతి, కొవ్వాడ బేబీ, బొక్కా సరస్వతి బూత్ కమిటీ కన్వీనర్ యరమాటి వెంకన్న బాబు, 21వ వార్డు ఇన్ చార్జి కంది నాగ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.