విఎస్‌యులో రేపు జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు..

నెల్లూరు (CLiC2NEWS): కాకుటూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో రేపు జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ డా. ఎల్ .విజయ కృష్ణా రెడ్డి ప్రకటనలో తెలిపారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య జి.యం.సుందరవల్లి అధ్యక్షతన జరుగుతున్న ఈ కార్యక్రమంలో శ్రీహరికోట లోని షార్ డైరెక్టర్ శ్రీ ఏ రాజరాజన్ గారు ముఖ్యఅతిథిగా మరియు జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు గారు గౌరవ అతిధులుగా పాల్గొంటారన్నారు. విశ్వవిద్యాలయం చరిత్రలో మొట్టమొదటి సారిగా జిల్లా విద్యార్థులలో సైన్స్ పై అవగాహన పెంపొందించేందుకు భారీ స్థాయిలో సైన్స్ దినోత్సవం ను నిర్వహించటం జరుగుతుందన్నారు.

ఇప్పటికే విశ్వవిద్యాలయ స్థాయిలో వ్యాసరచన, వకృత్వ పోటీలు, క్విజ్ మరియు పోస్టర్ ప్రెసెంటేషన్ పోటీలు నిర్వహించి అత్యుత్తమ ప్రతిభ కలిగిన సైన్స్ విద్యార్థులను ఎంపిక చేయటం జరిగిందన్నారు.
విశ్వవిద్యాలయ స్థాయిలో జరుగు ఈ సైన్స్ వేడుకలకు విద్యార్థులు, సైన్స్ అధ్యాపకులు మరియు విద్యావేత్తలు పాల్గొనాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.