Mandapet: జాతీయ క్రీడా దినోత్సవం – తెలుగు భాషా దినోత్సవపు వేడుకలు
మండపేట (CLiC2NEWS): జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ క్రీడా దినోత్సవం మరియు తెలుగు భాషా దినోత్సవపు వేడుకలు నిర్వహించారు. హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటాం. అదేవిధంగా తెలుగు కవి పిడుగు వెంకటరామమూర్తి జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం కూడా ఇదే రోజు జరుపుకుంటాం. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏడిద సర్పంచ్ బూరిగ ఆశీర్వాదం పాల్గొన్నారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ..మాతృభాషను సంరక్షించుకుంటేనే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందన్నారు. ఆంగ్లభాష నేర్చుకుంటూనే తెలుగు భాషను కాపాడుకోవాలన్నారు.
విద్యలో క్రీడలను తప్పనిసరిగా భాగం చేయాలని , ప్రతిభావంతులైన క్రీడాకారులను పాఠశాల స్థాయిలోనే గుర్తించి ప్రోత్సహించడం ఎంతో అవసరమని వైస్ ఎంపీపీ పసుమర్తి నాగేశ్వరరావు అన్నారు. క్రీడా పోటీలలో ప్రతిభజూపిన విజేతలకు బహుమతులు అందజేశారు. అథ్లెటిక్స్, కోకో, కబడ్డీ పోటీలకు 6000 రూపాయల బహుమతులను వైస్ ఎంపీపీ పసుమర్తి నాగేశ్వరరావు అందజేశారు. వాలీబాల్ పోటీలకు బహుమతులు అందజేసిన కిమ్స్ అమలాపురం వారిని గ్రామ టీడీపీ అధ్యక్షుడు పర్వతిన వీర్రాజు అభినందించారు. ఏడిదలో క్రీడాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయులు సిద్ధాంతపు వీర్రాజును శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ ఎర్రబ్బు, గ్రామ జనసేన అధ్యక్షుడు రామిశెట్టి రాజా, ఎస్ఎంసి చైర్మన్ నూతిక రాజేష్, ప్రధానోపాధ్యాయురాలు చింతా జయలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
