వి యస్ యూ లో జాతీయ ఓటర్స్ దినోత్సవం
నెల్లూరు (CLiC2NEWS): విక్రమ సింహపురి విశ్వ విద్యాలయ ప్రాంగణంలోని శ్రీపొట్టిశ్రీరాములు భవనం నందు జాతీయ ఓటర్స్ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఉపకులపతి ఆచార్య జి యం సుందరవల్లి ఓటుహక్కు ప్రతి ఒకరు వినియోగించుకోవాలని అలానే 18 సంవత్సరలు దాటిన వారు ఓటు నమోదు తప్పక చేసుకోవాలని అన్నారు. ఓటు హక్కు పై అవగాహనా కల్పించాలి అని అప్పుడే భాద్యతయుతమైన నయకత్వము తో మన ప్రజాస్వామ్యం కాపాడగలము అని తేలిజేశారు. ప్రజల భాగస్వామ్యంతోనే మంచి ప్రభుత్వం ఏర్పాటు చేయడం సాధ్యమవుతుందని తెలిపారు.
అదేవిధంగా మన దేశంలో ఎక్కువ శాతం యువ ఓటర్లు ఉన్నారని, వీరి చేతిలో దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని గుర్తు చేశారు. దేశంలో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వాలు భారీగా ఖర్చు పెడుతున్నాయని, రెవిన్యూ, ఇతర అధికారులు, సిబ్బంది అహర్నిశలు పనిచేసి ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారని, వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును విధిగా వినియోగించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్ విజయ కృష్ణ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ సుజా ఎస్ నాయర్, డాక్టర్ కె సునీత, డాక్టర్ టి వీర రెడ్డి, డాక్టర్ ఉదయ్ శంకర్ అల్లం, డాక్టర్ సుబ్బరామరాజు, డాక్టర్ ఆర్. మధుమతి,డాక్టర్ వెంకటరాయులు, పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ సీఎస్ సాయి ప్రసాద్ రెడ్డి, మరియు పొలిటికల్ సైన్స్ అధ్యాపకులు, వివిధ విభాగ అధ్యాపకులు, విద్యార్థులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.