Nellore: బాలజీ నగర్ మస్జిద్ సెంటర్ నందు ఘనంగా సంక్రాంతి సంబరాలు

నెల్లూరు (CLiC2NEWS): సంక్రాంతి పండుగ సందర్భంగా కనుమ పండుగ నాడు బాలాజీ నగర్ 15 వార్డ్ మస్జీద్ సెంటర్ నందు వై.యస్.ఆర్.సీపీ మహిళా అధ్యక్షురాలు షేక్ షమీమ్ గారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా షేక్ ఖాజావాలి (Ex నూడ డైరెక్టర్) గారు పాల్గొని వారి ముగ్గులను వీక్షించారు. ముగ్గుల పోటీలలో గెలిచిన మహిళలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిమ్ మహిళ అయినప్పటికి హిందూ సంప్రదాయన్నీ మన సాంస్కృతిని మరచిపోకుండా పార్టీలకు అతీతంగా అందరిని కలుపుకొని ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజున ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు.
షమీమ్ గారు మాట్లాడుతూ ఇంత మంది మహిళలు ముగ్గులు పోటీలో పాల్గొనటం చాలా సంతోషదాయకంగా ఉంది కాని మా నాయకులు మా సోదరుడు ఆనం వివేకానంద రెడ్డి గారు ఈరోజు లేకపోవడం చాలా బాధాకరంగా ఉందన్నారు. ఏది ఏమైనా ఆయన బాటలో నడిచే నేను ఆయన ఎలాంటి సంప్రదాయాన్ని అవలంభిస్తున్నారో నా ఊపిరి ఉన్నంతవరకు అలాంటిదే నేను కూడా అదే సంప్రదాయన్ని అవలంభించాలని నిర్ణయించుకున్నాను. కాబట్టి భారతీయ సంప్రదాయాన్ని ఎవరూ మర్చిపోకూడదు అందరూ ఒక్కటే రాజకీయాలకు అతీతంగా హిందు ముస్లిం క్రిస్టియన్ వేరు వేరు కాదు మనం అందరం ఒక్కటే పండగ వాతావరణం చూడాలి. అందరు కలిసి సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ముగ్గుల పోటీని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాము.
ఈరోజు అనివార్య కారణాలవలన ఆనం రంగ మయూర్ రెడ్డి రాలేదు లేకపోతే తప్పకుండా వచ్చిఉండేవాళ్ళు. అయినా కూడా వారి బాటలో నడుచుకుంటాను అని తెలియచేస్తూ ఈ పద్దతిని నేను ఎప్పుడు మర్చిపోను అని వారి ఆశీసులతో ఈ ప్రోగ్రాం ని ఎప్పుడూ చేస్తూనే ఉంటాను అని తెలియజేశారు. .నెల్లూరు భారతీయ సంప్రదాయానికి ఒక పుణ్యక్షేత్రం ఎందుకంటే నెల్లూరు పెన్నా నీరు ఎంత మంచిదో మీ అందరకీ తెలుసు ,నెల్లూరు బియ్యం,రంగ నాయకులు స్వామి ఆలయం,బారా షాహీద్ దర్గా,అయ్యప్పస్వామి గుడి ,రాజ రాజేశ్వరి గుడి ఎటు చూసినా పుణ్యక్షేత్రాలు మనం ఎక్కడికి భయటకి వెళ్లాల్సిన అవసరం లేదు అటువంటి నెల్లూరు లో పుట్టడం చాలా అదృష్టంగా భావిస్తూ వివేకన్న అడుగుజాడల్లో ఎప్పుడూ నా ఊపిరి ఉన్నంతవరకు నడుస్తాను అని తెలియచేస్తూ ఎవరు వచ్చినా రాకపోయినా నా ప్రోగ్రాం ని కచ్చితంగా చేస్తాను అలాగే 15 వ వార్డు మహిళలను నేను ఎప్పుడూ వదులుకోను అని తెలియచేస్తున్నాను .ఈ కార్యక్రమంలో శశిధర్, ముజీర్, మాలకొండయ్య, సోను, సుజాత,సుభాషిణి,మళ్ళీ,జిలాని,మరియు అబ్దుల్లా,నజీమా తదితరులు పాల్గొన్నారు.