జగన్స్ డిగ్రీ కళాశాలలో ఎన్ యస్ యస్ మెగాబ్లడ్ క్యాంప్

నెల్లూరు (CLiC2NEWS): జగన్స్ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో విద్యార్ధి, విద్యార్థినులు రక్తదానం కార్యక్రమాన్ని నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య జి యం సుందరావల్లి గారు, రిజిస్ట్రార్ డాక్టర్.ఎల్.విజయ కృష్ణా రెడ్డి గారు, ఎన్ యస్ యస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఉదయ్ శంకర్ అల్లం గారు విచ్చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య జి యం సుందర వల్లి మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థునులను ఉద్దేశించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడవలసిన బాధ్యత యువతపై ఉన్నది అని తెలిపారు.

రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్.విజయ కృష్ణ రెడ్డి గారు, మాట్లాడుతూ జగన్స్ కళాశాల యాజమాన్యం ,ఆధ్యాపక, ఆద్యాపకేతర  మరియు విద్యార్థిని, విద్యార్థునులు ప్రతి ఏటా నవంబర్ మరియు జనవరి నెలలో రక్తదాన శిబిరం నిర్వహించడం, విద్యార్థిని,విద్యార్థునులు 100 మంది పైగా రక్తదానం చేయడం చాలా సంతోషాదయకరం అని తెలిపారు.

ఈ కార్యక్రమం లో కళాశాల అధినేత మరియు కరెస్పాండెంట్ శ్రీ.మధుసూదన్ రెడ్డి గారు , జగన్స్ విద్యాసంస్థల డైరెక్టర్ శ్రీమతి శ్రీ.యస్.వి.మమత గారు, డీన్ శ్రీ పి.ఆదిశేషారెడ్డి గారు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ టి.రామకృష్ణ గారు, అడ్మినిస్ట్రేటు ప్రిన్సిపాల్ శ్రీ.ఆర్.విష్ణువర్ధన్ రెడ్డి గారు వైస్ ప్రిన్సిపాల్ బి.ప్రదీప్ గారు, మరియు ఎన్ యస్ యస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.