ఒంగోలు: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష కేంద్రంలో కాపీయింగ్..
ఒంగోలు (CLiC2NEWS): గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో ఓ అభ్యర్థి మొబైల్ సాయంతో కాపీయింగ్ చేస్తూ పట్టుబడ్డాడు. ఒంగోలులోని వెంగముక్క పాలెం రోడ్డులోని క్విస్ ఇంజినీరింగ్ కళాశాలలో ఓ అభ్యర్థి కాపీ చేస్తూ పోలీసులకు చిక్కాడు. పరీక్ష కేంద్రాల వద్ద తనిఖీలు చేసినప్పటికి.. సెల్ఫోన్ లోపలికి తీసుకెళ్లటం గమనార్హం. పరీక్ష రాసే సమయంలో బయట వ్యక్తులకు ఫోన్ చేసి సమాధానాలు తెలుసుకొని రాస్తుండగా ఇన్విజిలేటర్ గమనించి అతడిని పోలీసులకు అప్పగించారు.