Mandapeta: టౌన్ స్టేషన్ లో ఓపెన్ హౌస్ కార్య‌క్ర‌మం

మండపేట (CLiC2NEWS):  శాంతిభద్రతల పరిరక్షణ లో భాగం గా పోలీసు విధులు, బాధ్యతలు పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని మండపేట టౌన్ సి ఐ దుర్గాప్రసాద్ పేర్కొన్నారు. మండపేట జెడ్పి బాలికొన్నత పాటశాల విద్యార్థుల కు శనివారం టౌన్ పోలిస్ స్టేషన్ లో పోలిస్ ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు విధి నిర్వహణలో భాగంగా వినియోగించే ఆయుధాలు , దుస్తులు, పనిముట్లు, నేరదర్యాప్తు విధానం తదితర విషయాలను విద్యార్దులకు తెలియజేసారు.పోలిస్ అమరవీరుల  వారోత్సవాల్లో ప్రజల  శ్రేయస్సుకు దేశ రక్షణకు ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఈ వారోత్సవాలు చేపట్టినట్లు సి ఐ తెలిపారు.పోలీసులు వాడే ఆయుధాలు, వాటి విడి భాగాలైన మెటల్ డిటెక్టర్ ,  డ్రాగన్ లైట్, రాకర్, బాంబు డిస్పోజబుల్ పరికరాలు, ఫింగర్ ప్రింట్, పోలీసు కంట్రోల్ రూమ్, కమ్యూనికేషన్ మ్యాన్ ప్యాక్ సెట్స్ , నేర పరిశోధనలో ఉపయోగించే డాగ్ స్వ్కాడ్ బృందాలు, సెల్ ఫోన్ జామర్ల వంటి వాటిపై అవగాహన కల్పించారు.మహిళా శక్తీ టీమ్ పోలీసులు మహిళలపై జరిగే పలు నేరాల నియంత్రణకు తీసుకునే చర్యల గురించి  వివరించారు. నేరం జరిగినప్పుడు నేర స్ధలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, వేలిముద్రల వంటి ఆధారాలను  సేకరించడం తదితర అంశాలు   తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ ఎస్ ఐ బి రాజేష్ కుమార్, ఏ ఎస్ ఐ లు, హెచ్ సి లు, కానిస్టేబుల్ లు,మహిళా పోలీసులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.