పాలమూరు జిల్లాకు అన్యాయం జరగనివ్వంః మంత్రి కెటిఆర్

నారాయణ పేట (CLiC2NEWS): ముఖ్యమంత్రి కెసిఆర్ ఉండగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు అన్యాయం జరగనివ్వమని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తేల్చిచెప్పారు. కృష్ణా జలాలపై రాజీపడే ప్రసక్తే లేదు. చట్టప్రకారం రావాల్సిన నీటివాటాను సాధించుకుంటాం అని పునరుద్ఘాటించారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేస్తాము అని కెటిఆర్ పేర్కొన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో పర్యటించిన మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు.. భారతదేశంలో అత్యధికంగా వరి పంట పండించే రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది అని కేటీఆర్ గుర్తు చేశారు. ఊహించని విధంగా వరి పంట పండింది.. రైతుల దగ్గర పంట కొన్నాము అని తెలిపారు. నారాయణపేట జిల్లాలో కలెక్టరేట్, ఎస్పీ భవనాల నిర్మాణం కూడా చేపడుతామని మంత్రి తెలిపారు.
