పంచారామాలు
శ్రీనాథుడు రచించిన భీమేశ్వర పురాణం(సా.శ. 14 నుండి 15 శతాబ్ధం) లో, స్కందపురాణంలో పంచారామాల ఉద్భవం గురించి వేరువేరు కథలు ఉన్నాయి. భీమేశ్వర పురాణంలోని పంచారామాల ఉద్భవం గురించి ఉన్న కథ.. క్షీర సాగర మథనంలో వెలువడిన అమృతాన్ని మహావిష్ణువు మోహినీ రూపం ధరించి దేవతలకు, రాక్షసులకు పంచుతుండగా.. పంపకంలో తమకు అన్యాయం జరిగిందని రాక్షసులు త్రిపురనుల, నాధుల నాయకత్వంలో తీవ్రమైన జపతపాలను ఆచరిస్తారు. దానికి మెచ్చిన శివుడు వారికి వరాలు ఇస్తాడు. ఆ వరాలతో దేవతలను బాధలకు గురిచేస్తారు.
దాంతో దేవతలందరూ మహాదేవుని శరణువేడుకుంటారు. దేవలతల మొర ఆలకించిన శివుడు రాక్షసులను నాశనం చేస్తాడు. ఆ సమయంలోని శివుని రూపమే త్రిపురాంతకుడుగా ప్రసిద్ధి. ఈ యుద్ధంలో త్రిపురాసురులు పూజచేసిన ఒక పెద్ద లింగం మాత్రం చెక్కుచెదరకుండా అలానే ఉంటుంది. ఈ లింగాన్ని మహాదేవుడు ఐదు ముక్కలుగా చేసి వేరువేరు ప్రదేశాలలో ప్రతిష్టింపచేసినట్లు పురాణాల్లో ఉంది. ఆ ఐదు ప్రదేశాల్లో పంచారామాలుగా ప్రసిద్ధికెక్కాయని ప్రతీతి.
- దక్షారామం -భీమేశ్వరుడు ( ద్రాక్షారామం, కోనసీమ జిల్లా)
- కుమారారాం – భీమేశ్వరుడు (సామర్ల కోట, కాకినాడ జిల్లా)
- క్షీరారామం – రామలింగేశ్వరుడు (పాలకొల్లు, పశ్చిమ గోదావి జిల్లా)
- భీమారామం – సోమేశ్వరుడు (భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా)
- అమరారామం – అమరేశ్వరుడు (అమరావతి, పల్నాడు జిల్లా)
రేపు స్కంద పురాణంలో పంచారామలు ఏవిధంగా ఆవిర్భవించినవో తెలిపిన కథ తెలుసుకుందాం.
-పూర్ణిమా
అడ్వకేట్
మరిన్ని `ఒక్కమాట`ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: కార్తీక శోభ..
[…] మరిన్ని `ఒక్కమాట`ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: పంచారామాలు […]