నిబద్ధత కలిగిన నాయకుడు పట్టాభి రామయ్య చౌదరి

మండపేట (CLiC2NEWS) : ఏ పదవిలో ఉన్నా ఏ రంగంలో ఉన్నా ఆ రంగాలను అభివృద్ధి పథం వైపు నడిపించే సమర్థత సామర్థ్యం కలిగిన నాయకుడు వేగుళ్ల పట్టాభి రామయ్య చౌదరి అని శాసన మండలి సభ్యులు తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శిగా నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన పట్టాభి సేవలు రైస్ మిల్లర్స్ కు ఎంతో అవసరమన్నారు. ఇటు రాజకీయాల్లోనూ అటు పారిశ్రామిక రంగంలోను నిజాయితీ నిబద్ధత కలిగిన నాయకుడిగా తనదైన ముద్ర వేసుకున్న పట్టాభి మున్ముందు ఎన్నో బాధ్యతాయుతమైన ఉన్నత పదవులు చేపట్టాలని అభిలషించారు. రథం సెంటర్ లో ఉన్న మున్సిపల్ చైర్ పర్సన్ కార్యాలయంలో  జరిగిన పట్టాభి అభినందన సభకు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ముఖ్య అతిథిగా విచ్చేశారు. కేక్ కట్ చేసి తన ఆత్మీయ అభిమానాన్ని చాటుకున్నారు. ఇప్పటివరకు ఆలమూరు తాలూకా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వ్యవహరించిన పట్టాభి రామయ్య చౌదరి రాష్ట్ర నాయకత్వం అంది పుచ్చుకోవడం ఎంతో శుభపరిణామమని శ్లాఘించారు. ఈ సందర్భంగా తోట మాట్లాడుతూ రాష్ట్ర కార్యదర్శిగా పట్టాభి ఎన్నికవడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించింది అన్నారు. నిరాడంబరుడు నిస్వార్థపరుడిగా కీర్తి గడించిన పట్టాభి రైస్ మిల్లర్స్ కు తన సేవల ద్వారా మరింత ఖ్యాతిని గడించాలని ఆకాంక్షించారు. మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ దుర్గా రాణి, పురపాలక సంఘ కౌన్సిలర్లు, ఆర్యవైశ్య మహాసభ నాయకుడు కాళ్లకూరి నాగబాబు, కాపు అభ్యుదయ సంఘం ప్రెసిడెంట్ జిన్నూరి సత్య సాయి బాబా, కొమ్ము రాంబాబు, వైసీపీ పట్టణ కోశాధికారి శిరంగు శ్రీనివాస్ తదితర నాయకులు అభినందనలు తెలియజేశారు. గజమాలతో ఘనంగా సత్కరించి ఆయనకు పుష్పగుచ్చాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి టౌన్ కన్వీనర్ ముమ్మిడివరపు బాపిరాజు, పతివాడ రమణ, మూడవ వార్డు వైసిపి ఇన్చార్జి చాలా శిరీష్ చౌదరి, అమలదాసు రుద్రమూర్తి, సీతిని సూరిబాబు, జొన్నపల్లి సత్తిబాబు, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.