రైతును ఏడిపించిన ప్రభుత్వం తుడిచిపెట్టుకుపోవాలి: జనసేనాని

తణుకు (CLiC2NEWS): రైతును ఏడిపించిన ప్రభుత్వం తుడిచిపెట్టుకుపోవాలని జనసేనాని పవన్‌కల్యాణ్ అన్నారు. తణుకులో నిర్వహించిన ప్రజాగళం సభలో పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ.. తణుకులో జనసేన అభ్యర్థిని ప్రకటించిన తర్వాత కూడా వెనక్కి తగ్గామని, బిజెపి కోసం అనకాపల్లి ఎంపి సీటును వదులుకున్నామన్నారు. చంద్రబాబు కూడా తగ్గారు. ఇది రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే ఇదంతా చేస్తున్నామని, కలిసికట్టుగా రాష్ట్రాన్ని రానున్న ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకే పొత్తు పెట్టుకున్నామన్నారు.
కేంద్ర సహాయ సహకారాలు రాష్ట్రానికి అవసరమని, చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి కావాలని పవన్‌కల్యాణ్ అన్నారు. నాలుగు దశాబ్దాలుగా ఒడిదొడుకులు ఎదుర్కొన్న నాయకుడు చంద్రబాబని, ఆయన అనుభవం అవసరమన్నారు. ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తు బాగుండాలనే తగ్గానని పవన్‌కల్యాణ్ అన్నారు. జగన్ యువతకు ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారని, చివరకు పోలీసుల శ్రమశక్తిని కూడా దోపిడి చేశారని ఆరోపించారు. 70 వేల పోలీసు కుటుంబాలకు టిఎ, డిఎలు, సరెండర్ లీవ్స్ ఈరోజు వరకు ఇవ్వలేదన్నారు. ధాన్యంలో మొలకుల వచ్చాయని రైతు ఏడుస్తుంటే.. ఇక్కడి మంత్రి అహంకారంతో బూతులు తిట్టారన్నారు. ప్రస్తుత ప్రభుత్వ అహంకారాన్ని తుడిచిపెట్టే రోజులు వస్తాయని పవన్ కల్యాణ్ అన్నారు.