జనసేన స్టార్ క్యాంపెయినర్‌లుగా ఆది, గెటప్‌శీను..

అమరావతి (CLiC2NEWS): జనసేన అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్లను పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ ప్రకటించారు. ఎపి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ నేతలు , అభ్యర్థులు ప్రచారం ప్రారంభించారు. బిజెపి, టిడిపి, జనసేన పొత్తులతో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలు కేటాయించిన సంగతి తెలిసిందే. పిఠాపురం నుండి పవన్‌కల్యాణ్ పోటీ చేయనున్నారు. ఈ క్రమంలో పార్టీ తరపున ప్రచారం చేయడానికి పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు, క్రికెటర్ అంబటి రాయుడు, డ్యాన్స్ మాస్టర్ జానీ మాస్టర్, సినీ నటులు సాగర్, పృథ్వీ, హైపర్ ఆది, గెటప్ శ్రీనులను ప్రచారకర్తలుగా నియమించారు.