తెలంగాణ అసెంబ్లీలో 10 మంది జనసేన ఎమ్మెల్యలు ఉండాలి: జనసేనాని
నాచుపల్లి (CLiC2NEWS): జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనసేన ప్రచార రథం ‘వారాహి’కి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ప్రారంభించారు. అనంతరం జగిత్యాల జిల్లా నాచుపల్లిలో తెలంగాణ ముఖ్య నాయకులతో పవన్ సమావేశమయ్యారు. జనసేనాని మాట్లాడుతూ.. తెలంగాణ పోరాటాల గడ్డ. దేశంకంటే రెండేళ్లు ఆలస్యంగా తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిందన్నారు. నేను ఆశయం కోసం పోరాడుతున్నానని.. తెలంగాణ ప్రజలకు సందేశం ఇచ్చే స్థాయిలో నేను లేనని, ప్రజల నుండి నేర్చుకునే స్థాయిలో ఉన్నానని పవన్‌కల్యాణ్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో 25 నుండి 40 అసెంబ్లీ స్థానాలు, 7 నుండి 14 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసేందుకు జనసేన పార్టీ సిద్దంగా ఉందన్నారు. తెలంగాణ అసెంబ్లీలో 10 మంది జనసేన ఎమ్మెల్యలు ఉండాలని కోరుకుంటున్నానిని అన్నారు.తెలంగాణలో బిజెపితో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. కానీ మద్దతు ఉంటుందన్నారు. ఎవరైనా పొత్తుకు వస్తే సంతోషమని జనసేనాని అన్నారు.
