పెన్షన్ల తొలగింపు నిర్ణయం ఉపసంహరించుకోవాలి: ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు
మండపేట (CLiC2NEWS): సామాజిక భరోసా పెన్షన్ల తొలగింపుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని శుక్రవారం మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు తదితర టీడీపీ నాయకులు నిరసన తెలియజేశారు. ఈమేరకు ఎంపీడీవో ఐదం రాజుకు వినతి పత్రం అందజేశారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం కొత్త విధానానికి నియోజక వర్గంలో 648 మందికి పింఛన్లు రద్దు కానున్నాయని అన్నారు. పెన్షన్ సొమ్ముతో కడుపు నింపుకునే వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. గత నెల(ఆగస్టు)లో ఇంటిలో ఒకరికి మాత్రమే పెన్షన్ అంటూ లక్షలాది మందికి పెన్షన్లు దూరం చేశారు. ఈ నెల (సెప్టెంబర్)లో ఏ నెల పెన్షన్ ఆ నెలలో మాత్రమే తీసుకోవాలనే నిర్ణయంతో లక్షలాది మందికి పెన్షన్లు దూరం చేస్తున్నారు. ఇంట్లో విధి వక్రించి భర్తను కోల్పోయి వితంతువుగా ఉన్న మహిళ, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, అత్త మామలు ఉంటే ఎవరో ఒకరికే పెన్షన్ అనడం ఎంతటి దుర్మార్గమో ప్రజలు ఆలోచన చెయ్యాలన్నారు. ఏ నెల పెన్షన్ ఆ నెలలోనే అనే నిర్ణయంతో వైద్యం కోసం ఆస్పత్రుల్లో ఉండి, కూలి పనుల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు, విద్య, ఉద్యోగాల కోసం పట్టణాలు, నగరాలకు వెళ్లిన పిల్లలను చూడడానికి వెళ్లిన వారు గత నెలలో పెన్షన్ అందుకోని వారికి ఆ సొమ్ము ఈ నెల ఇవ్వకుండా ప్రభుత్వం ద్రోహం చేస్తోందని ఆరోపించారు.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పెన్షన్ దారుడు పెన్షన్ ఇచ్చే సమయానికి లేకపోయినప్పటికీ వచ్చే నెలలో రెండు నెలలకు సంబంధించిన పెన్షన్ అందించడం జరిగేదన్నారు. కొన్నిసార్లు స్థానిక వీఆర్వో, గ్రామ కార్యదర్శుల అనుమతితో మూడు నెలల పెన్షన్ కూడా ఒకేసారి ఇచ్చిన సందర్భాలున్నాయి. కానీ నేడు పెన్షన్ ఇచ్చే సమయానికి ఇంట్లో ఉండాల్సిందే అన్న నిర్ణయంతో వ్యవసాయ కూలీలు, అనారోగ్య సమస్యలతో ఆస్పత్రుల్లో ఉన్నవారికి పెన్షన్ దూరం చేయడం దుర్మార్గం కాదా అని వ్యాఖ్యానించారు. ఒక ఇంట్లో ఒకరికే పెన్షన్, ఏ నెల పెన్షన్ ఆ నెల అనే నిర్ణయాలపై ప్రభుత్వం పునఃసమీక్షించాలని హితవు పలికారు.
మరోవైపు ప్రతి అవ్వ తాతకు రూ.3,000 పెన్షన్ ఇస్తానన్న హామీకి రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడిచిందని విమర్శించారు. ప్రతి ఏటా రూ.250 చొప్పున పెంచుకుంటూ పోతానని చెప్పిన ముఖ్యమంత్రి మూడో సంవత్సరం వచ్చినప్పటికీ ఇంకా పెన్షన్ పెంచక పోవడాన్ని ఎత్తి చూపారు. రెండో ఏడాది రూ.2,500, ఈ సంవత్సరం జులై నుండి రూ.2,750 చొప్పున పెన్షన్ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ఇంకా రూ.2,250 మాత్రమే అందించడం ప్రభుత్వం చేతకాని తనానికి నిదర్శనం అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ మొత్తాన్ని పెంచకపోవడంతో ఒక్కో వృద్ధుడికి రూ.20,250 చొప్పున నష్టం జరిగిందని వివరించారు. ఆ సొమ్మును వెంటనే ప్రతి వృద్ధుడికి అందించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వికలాంగుల పెన్షన్ రూ.5,000 చేస్తామన్న హామీని కూడా వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేసారు. లేదంటే టీడీపీ ఆందోళన ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ళ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, టీడీపీ నాయకులు గోసాల సుజాత ప్రసాద్, పిల్లా తాతీలు, చేకూరి రమేష్ రాజు, అడబాల బల్లబ్బు, కంటిపూడి శ్రీను, కర్రి తాతారావు తదితర నాయకులు పాల్గొన్నారు.
Hurrah, that’s what I was looking for, what a material!
existing here at this weblog, thanks admin of this website.
Ahaa, its nice conversation concerning this article at this place
at this blog, I have read all that, so now me also commenting here.
Here is my blog post – wreath 40
Alex talks about her engagement to Mikee Morada and
the longer term she envisions for them.
Here is my blog; OFW
Actually Tambayan Philippines is the regional notice board and WikiProject for
articles associated to the Philippines.
My web-site: CinePinoy
Wow, superb blog format! How long have you been blogging for? you made running a blog look easy. The total glance of your site is wonderful, as neatly as the content material!!