పోస్టల్ ఉద్యోగి పసుపులేటి వెంకటేశ్వర్లు పదవీ విరమణ

కుతుకులూరు (CLiC2NEWS) : పసుపులేటి వెంకటేశ్వర్లు పదవీ విరమణ సందర్భంగా జరిగిన అభినందన సభలో పలువురు వక్తలు ప్రసంగించారు. విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులను ప్రజలు కలకాలం గుర్తుపెట్టుకుంటారని రామచంద్రపురం హెడ్ పోస్ట్ మాస్టర్ కె విఠల్ నాథ్ పేర్కొన్నారు. మూడున్నర దశాబ్దాల పాటు సేవలు అందించిన పసుపులేటి వెంకటేశ్వర్లు పదవీ విరమణ సందర్భంగా శనివారం రాత్రి కుతుకులూరు సబ్ పోస్ట్ ఆఫీస్ లో జరిగిన పదవీవిరమణ సభకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రామవరం గ్రామం పోస్ట్ మెన్ గా పనిచేసిన పసుపులేటి వెంకటేశ్వర్లు పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా రామవరం ఎం శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. పెన్షనర్ల సంఘం నాయకులు టి పుల్లేశ్వరరావు మాట్లాడుతూ చిన్న ఉద్యోగిగా తపాలా శాఖలో ప్రవేశించిన వెంకటేశ్వర్లు రాయవరం పోస్ట్ ఆఫీసులో విశిష్ట సేవలు అందించారని ఆయన కొనియాడారు. రామచంద్రపురం డిప్యూటీ పోస్ట్ మాస్టర్ ఎల్ వి నాగేంద్రబాబు మాట్లాడుతూ వెంకటేశ్వర్లు ప్రజల్లో మంచిగా కలిసిపోయి ఎన్నో సేవలు అందించారన్నారు.