ఘనంగా ప్రభాస్ జన్మదిన వేడుకలు..
మండపేట (CLiC2NEWS): పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మండపేట పట్టణంలో ప్రభాస్ అభిమానులు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభాస్ ఫ్యాన్స్ అధ్యక్షుడు దాసరి క్రిష్ణ, ప్రభాస్ సేవా సమితి గౌరవాధ్యక్షులు అడ్డూరి వీరబాబు, ప్రెసిడెంట్ ముత్యాల జానకిరామ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రభాస్ పేరున పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ధర్మగుండం చెరువు సీతారామ కల్యాణ మండపం వెనక ఉన్న మయూరి వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి పంచారు. అనంతరం ఆశ్రమంలో తలదాచుకున్న వృద్దులకు భోజనాలు ఏర్పాటు చేశారు. పండ్లు మిఠాయిలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో పొలమూరి వెంకట దుర్గాప్రసాద్, జాన్సన్, యలమంచిలి బ్రదర్స్, నాయుడు రాజేష్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.