Prabhas: ‘ది రాజాసాబ్’ నుండి వీడియో సాంగ్
The Raja Saab: ప్రభాస్ కథానాయకుడిగా రొమాంటిక్ కామెడీ హారర్ మూవీగా తెరకెక్కిన చిత్రం ‘ది రాజాసాబ్’. మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి సందడి చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం నుండి ‘సహానా సహానా’ పాటను చిత్రం బృందం తాజాగా విడుదల చేసింది. ఈ పాటలో ప్రభాస్-నిధి అగర్వాల్ జోడీ ఆకట్టుకుంటుంది. తాజాగా విడుదలైన పాటను కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా విశాల్ మిశ్రా ఆలపించారు. సంగీతం అందించింది తమన్.