Tandur: క‌ట్నం కోసం భార్య‌ను హ‌తమార్చిన భ‌ర్త

క‌ట్నం కోసం వేధింపులు.. వివాహిత మృతి

తాండూరు (CLiC2NEWS): వికారాబాద్ జిల్లా తాండూరు ప‌ట్ట‌ణంలో క‌ట్నం కోసం భార్య‌ను హ‌త‌మార్చాడు భ‌ర్త‌. ప్రేమ వివాహం చేసుకున్నాడు.. కానీ, క‌ట్నం కోసం భార్య‌ను హ‌త్య చేశాడు. ఈ ఘ‌ట‌న సాయిపూర్‌లో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివారాల ప్ర‌కారం.. ప‌ర‌మేశ్ , అనూష‌ 8 నెల‌ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంత‌రం అత్త‌మామ‌ల‌తో క‌లిసి ఉంటున్నారు. కొన్ని రోజులుగా క‌ట్నం తేవాల‌ని అత్తమామాలు, భ‌ర్త వేధిస్తున్నారు. ఈ క్ర‌మంలో 3 రోజుల క్రితం భ‌ర్త అనూష‌పై దాడి చేశాడు. దీంతో అమెకు తీవ్ర గాయాల‌య్యాయి. అనూష సోద‌రుడు , త‌ల్లి తీసుకెళ్లి చికిత్స చేయించారు. అనంత‌రం సోద‌రిడితో క‌లిసి పుట్టింటికి వెళుతుండ‌గా.. భ‌ర్త ప‌ర‌మేశ్ ఆపి ఇంటికి తీసుకెళ్లాడు. వారిరువురు మ‌ళ్లీ గొడ‌వ‌ప‌డ్డారు. భ‌ర్త అనూష‌ను కొట్ట‌డంతో ఆమె ఆప‌స్మార‌క స్థితిలోకి వెళ్లింది. గ‌మ‌నించిన స్థానికులు ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా.. చికిత్స పొందుతూ అనూష మృతి చెందింది. పోలీసుల‌కు అందిన ఫిర్యాదు మేర‌కు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

 

ఐదుగురు ఎమ్మెల్యేలపై అన‌ర్హ‌త పిటిష‌న్లు కొట్టివేత‌

1 Comment
  1. […] Tandur: క‌ట్నం కోసం భార్య‌ను హ‌తమార్చిన భ… […]

Leave A Reply

Your email address will not be published.