ఐదుగురు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు కొట్టివేత
హైదరాబాద్ (CLiC2NEWS): ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లపై సభాపతి సంచలన తీర్పు ఇచ్చారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలు కాగా .. ఎనిమిది మందికి సంబంధించి విచారణ పూర్తి చేశారు. అందులో ఐదుగురు ఎమ్మెల్యేలు బిఆర్ ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారని విమర్శలు ఎదుర్కుంటన్న వారికి ఊరట లభించింది. తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి , గూడెం మహిపాల్ రెడ్డి , ప్రకాశ్‌గౌడ్, అరికెపూడి గాంధీపై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టి వేస్తూ సంచలన తీర్పునిచ్చారు. ఐదుగురు అనర్హత వేటుకు తగిన ఆధారాలు లేవని, సాంకేతికంగా వారు భారత రాష్ట్ర సమితిలోనే ఉన్నట్లు స్పష్టం చేశారు.
గురువారం శ్రీనివాస్ రెడ్డి , కాలే యాదయ్య, సంజయ్ కుమార్‌కు సంబంధించిన తీర్పు వెలువడుతుంది. దానం నాగేందర్, కడియం శ్రీహరి పై దాఖలైన పిటిషన్లకు సంబంధించి విచారణ పూర్తి కాలేదు.
[…] […]