జనవరి నుండి పలు వాహనాల ధరలు పెంపు
ఢిల్లీ (CLiC2NEWS): 2024, జనవరి నుండి పలు వాహనాల ధరలు పెరగనున్నాయి. మహీంద్ర , ఓల్వో, మారుతి సుజుకి, టాటా మోటార్స్ ఆడి, మెర్సిడెస్, బెంజ్ కార్ల ధరలు పెరగున్నట్లు సమాచారం. మహీంద్రా అండ్ మహీంద్రా.. ప్యాసింజర్, కమర్షియల్ వాహన ధరలను జనవరి నుండి పెంచనుంది. ఎస్యువి, కమర్షియల్ వాహన మోడల్‌ను బట్టి ధరల పెంపు ఉంటుందని సంస్థ వెల్లడించింది.
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ తమ ప్యాసింజర్ వాహన ధరలు జనవరి నుండి పెంచనున్నట్లు ప్రకటించింది. అయిఏత ఎంత మేర పెంపు అనేది ప్రకటించలేదు. పెంపు మొత్త, ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తామని టాటా మోటర్స్ ప్రతినిధి పేర్కొన్నారు.
జనవరి 1వ తేదీ నుండి ఓల్వో కార్ల ధరలు రెండు శాతం మేర పెరగున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. మార్కెట్ పరిస్థితులు, ముడి సరకు ధరలు పెరగడం, వేదీశీ మారకం విలువల్లో హెచ్చుతగ్గులు కారణంగా కార్ల ధరలు పెంచే నిర్ణయం తీసుకున్నట్లు ఓల్వో కార్ ఇండియా ఎమ్‌డి జ్యోతి మల్హోత్రా తెలియజేశారు.
ఇక బిఎండబ్ల్యూ కార్ల ధరలు కూడా వచ్చే ఏడాది జనవరి నుండి పెరగున్నట్లు సమాచారం. జర్మనీకి చెందిన కార్ల తయారీ సంస్థ అయిన బిఎండబ్ల్యూ ఇండియా భారత్‌లో 220ఐ ఎమ్ స్పోర్ట్ నుండి ఎక్స్ఎమ్ వరకు వివిధ రకాల కార్లను విక్రయిస్తుంది. వీటి ధరలు రూ. 43.5 లక్షల నుండి రూ. 2.6 కోట్ల వరకు ఉంటుంది.