సూర‌త్ డైమండ్ బోర్స్‌.. ప్ర‌పంచంలోనే అతిపెద్ద కార్యాల‌య స‌ముదాయం

సూర‌త్ (CLiC2NEWS): ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాపార కార్యాల‌యం ‘సూర‌త్ డైమండ్ బోర్స్‌’ (ఎస్‌డిబి)ని ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర‌మోడి ఆదివారం ప్రారంభించారు. ఒకేసారి 65 వేల మంది వ్యాపార కార్య‌క‌ల‌పాలు నిర్వ‌హించే భ‌వ‌న స‌ముదాయం. వ‌జ్రాలు, వ‌జ్రాభ‌ర‌ణాల అంత‌ర్జాతీయ వ్యాపారానికి ఇది కేంద్రంగా నిలుస్తుంది. సూర‌త్ డైమండ్ బోర్స్ ద్వారా 1.5 ల‌క్ష‌ల మంది ఉపాధి ల‌భించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోడి మాట్లాడారు. సూర‌త్ కేంద్రంగా ఉన్న వ‌జ్రాల ప‌రిశ్ర‌మ ఎనిమిది ల‌క్ష‌ల మందికి ఉపాధి క‌ల్పిస్తోంద‌ని మోడి తెలియ‌జేశారు.

సూర‌త్ వ‌జ్రాల వ్యాపారానికి ప్ర‌సిద్ధి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా వ‌జ్రాల‌ను సాన‌బెట్ట‌డం, పాలిష్ చేయ‌డం వంటి 90% కార్య‌క‌లాపాలు ఇక్క‌డే జ‌రుగుతుంటాయి. సూర‌త్ న‌గ‌రానికి స‌మీపంలో ఖాజోడ్ గ్రామంలో 67 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో సూర‌త్ డైమండ్ బోర్స్‌ భ‌వ‌న స‌ముదాయం నిర్మించారు. సుద్ది చేసిన ముడి వ‌జ్రాల వ్యాపారానికి ఇది అంత‌ర్జాతీయ కేంద్రంగా మారుతుంది. ఎగుమ‌తులు, దిగుమ‌త‌లుక సంబంధించిన క‌స్ట‌మ్స్ క్ల‌య‌రెన్స్ హౌస్ కూడా దీనిలో ఉన్న‌ట్లు స‌మాచారం. అభ‌రణాల రిటైల్ వ్యాపారులు త‌మ విక్ర‌య కేంద్రాలు కూడా ఇక్క‌డ ఏర్పాటు చేసువ‌చ్చు. ముంబ‌యి కేంద్రంగా ప‌నిచేస్తున్న అనేక మంది వ‌జ్రాల వ్యాపారులు ఎస్‌డిబిలో కార్యాల‌యాలు ద‌క్కించుకున్న‌ట్లు తెలుస్తోంది. వేలం ప‌ద్ధ‌తిలో వారు కార్యాల‌యాల‌ను ద‌క్కించుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.