Nagpur: సోలార్ కంపెనీలో భారీ పేలుడు సంభ‌వించి 9 మంది మృతి

నాగ్‌పూర్ (CLiC2NEWS): మ‌హారాష్ట్రలోని నాగ్‌పూర్‌లోని ఓ కంపెనీలో భారీ పేలుడు సంభ‌వించింది. ఈ ప్ర‌మాదంలో 9 మంది మృతి చెందారు. ఈ ఘ‌ట‌న‌లో మ‌రో ముగ్గురికి గాయాల‌య్యాయి. వారి ప‌రిస్థితి విష‌య‌మంగా ఉన్న‌ట్లు స‌మాచారం. నాగ్‌పూర్‌లోని బ‌జ‌ర్‌గాన్‌లో ఉన్న సోలార్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీకి చెందిన కాస్ట్‌బూస్ట‌ర్ ప్లాంట్‌లో ప్యాకింగ్ చేస్తున్న స‌మ‌యంలో ఈ పేలుడు సంభ‌వించింది. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ప్ర‌మాద స్థలానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. మ‌ర‌ణించిన వారిలో ముగ్గురు మ‌హిళలు కూడా ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.