తోట పృథ్విరాజ్ జన్మదిన వేడుకలు

మండపేట (CLiC2NEWS) : యువనేతగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన శాసన మండలి సభ్యులు తోట త్రిమూర్తులు తనయుడు పృథ్వీరాజ్ తండ్రికి తగ్గ తనయుడిగా ఎదిగి పేరు ప్రఖ్యాతులు సాధించాలని మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ దుర్గారాణి, కో ఆఫ్షన్ సభ్యుడు, పార్టీ సీనియర్ రెడ్డి రాథాకృష్ణ పేర్కొన్నారు. పృథ్వీ 28వ పుట్టిన రోజు వేడుకలు మంగళవారం మండపేటలో ఘనంగా జరిగాయి. విజయలక్ష్మి నగర్ లో నూతనంగా ఏర్పాటైన వైఎస్సార్సీపీ కార్యాలయంలో టౌన్ కన్వీనర్ ముమ్మడివరపు బాపిరాజు ఆధ్వర్యంలో పృథ్వీ పుట్టిన రోజు సంబరాలు అంబరాన్నంటాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన చైర్ పర్సన్ దుర్గారాణి కేక్ కట్ ఆయన అభిమానులకు పంచారు. ఈ సందర్భంగా వారంతా పృథ్వీ కు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంచి వ్యక్తిత్వం, చిరునవ్వుతో అందరినీ ఆప్యాయంగా పలకరించే వ్యక్తి పృథ్వీ అన్నారు. అందరితో గౌరవ మర్యాదలతో నడుచుకునే వ్యక్తి పృథ్వీ అన్నారు. నియోజక వర్గం అభివృద్ధికి తోట త్రిమూర్తులు కంకణబద్దులై పనిచేస్తున్నారని పృథ్వీ కూడా తండ్రి బాటలో పయనిస్తూ పేరుప్రఖ్యాతులు సాధించాలని అభిలషించారు. ప్రజలతో మమేకమవుతూ వారి సాధక బాధలు తెలుసుకుని అన్ని వర్గాల ప్రజల ఆదరణ పొందాలని ఆకాంక్షించారు. భవిష్యత్ లో మంచి మంచి అవకాశాలు రావాలని రాజకీయాల్లో తండ్రి కంటే గొప్ప పేరు తెచ్చుకోవాలని వారు ఆపేక్షించారు. ఈ సందర్భంగా ఎన్నో ఆనందకరమైన పుట్టిన రోజులు నూరేళ్ళ కాలం పాటు జరుపుకుని ఎల్లకాలం ఆయురారోగ్యాలతో చిరంజీవిగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ద్వారపూడి సర్పంచ్ ఈతోకోట కిన్నెర, ఉప సర్పంచ్తులాశేషారావు, సొసైటీ ప్రెసిడెంట్ దంతులూరి శ్రీరామవర్మ, మున్సిపల్ వైస్ చైర్మన్ పిల్లి గనేశ్వరరావు, మండల విప్ పసుమర్తి నాగేశ్వరరావు, కౌన్సిలర్ లు నీలం దుర్గమ్మ, మొండి భవానీ మురళీ, ముక్కా మేరీ స్వరూపారాణి, బొక్కా సరస్వతి, శెట్టి కళ్యాణి, పోతంశెట్టి వర ప్రసాద్, మారిశెట్టి సత్యనారాయణ, కో ఆఫ్షన్ సయ్యద్ రబ్బానీ, 10వ ఇన్ చార్జి కొప్పిరెడ్డి పద్మావతి, పార్టీ నాయకులు పొలమాల సత్తిబాబు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రధాన కార్యదర్శి యాళ్ళ శ్రీనివాస్, కాశిన వెంకటేశ్వరరావు, గోరు అన్నవరం, దాసరి వెంకన్న, ముక్కా దాలయ్య, ముక్కా సుబ్రహ్మణ్యం, వీరమల్లు శ్రీనివాస్, సిరంగు శ్రీనివాస్, శెట్టి ఆనంద్, చిటికిరెడ్డి శ్రీనివాస్, కుక్కల నాగబాబు, వాసంశెట్టి శ్రీను, గుత్తుల శ్రీను, ఎంకే మల్లేశ్వరరావు, చిక్కాల రాంబాబు, సాధనాల శివ భగవాన్, కోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.