కామత్ ఆర్కేడ్ లో తోట పృథ్వీరాజ్ జన్మదిన వేడుకలు

మండపేట (CLiC2NEWS) : వైసీపీ యువనేత తోట పృథ్వీరాజ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని కామత్ ఆర్కేడ్ లో ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకుడు పలివెల సుధాకర్ ఆధ్వర్యంలో పృథ్వీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పృథ్వీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసి అభిమానాన్ని చాటుకున్నారు. సౌమ్యుడు, సహృదయుడు అయిన పృథ్వీ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అందరితో కలుపుగోలు తనంగా మంచిగా మసులుకునే వ్యక్తి పృథ్వీ అని పలివెల సుధాకర్ పేర్కొన్నారు. యువనేత సారథ్యంలో తామంతా నడుచుకొని పార్టీ పటిష్టతను గ్రామ గ్రామాల్లో ఇనుమడింపజేస్తామని అన్నారు. ఇప్పటికే పలు ఎన్నికల్లో జరిగిన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న పృథ్వీ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారని అన్నారు. అదే ఒరవడితో దూసుకుపోతూ భవిష్యత్ లో ఎంతో ఎత్తుకు ఎదగాలన్నదే తమ ఆకాంక్ష అన్నారు.
కార్యక్రమంలో పైడిమళ్ళ రాజు, తాండూర్ పాప చార్యులు, కర్రి వెంకట సూర్యనారాయణ రెడ్డి, అయినవిల్లి లాజర్, జంపా సాయి, ఉండ్రాసి ఏలియా, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.