నగరంలో ఎడతెరపి లేకుండా వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలో మూడు రోజులనుండి వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. జిహెచ్ ఎంసి పరిధిలో 426 మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను ఏర్పాటు చేశారు. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోకుండా చర్యలు తీసుకుంటున్నారు. అనేక చోట్ల వాహనాలు భారీగా నిలిచిపోయి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. పోలీసులు వాహనాలను దారి మళ్లిస్తున్నారు. జిహెచ్ ఎంసి సిబ్బంది కూడా సహాయక చర్యలో పాల్గొంటున్నారు. లింగంపల్లి రైల్వే అండర్ పాస్ నీట మునిగింది.