ఎపి కొత్త డిజిపిగా రాజేంద్రనాథ్ రెడ్డి నియామకం

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ కొత్త డిజిపిగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ నియమితులైనారు. ఎపి డిజిపి గౌతమ్ సవాంగ్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో రాజేంద్రనాథ్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఇంటిలిజెన్స్ చీఫ్‌గా ఉన్న ఆయన డిజిపిగా పూర్తి బాద్యతలు చేపట్టనున్నారు. రాజేంద్రనాథ్ రెడ్డి 1992 బ్యాచ్‌కు చెందిన ఐపిఎస్ అధికారి. విశాఖపట్నం, విజయవాడ పోలీస్ కమిషనర్‌గానూ పనిచేశారు. ఔషధ నియంత్రణ విభాగం అధికారిగానూ ఆయన సేవలందించారు.