క‌ర్ణాట‌క‌లో రోడ్డు ప్ర‌మాదం: నారాయ‌ణ‌ఖేడ్ కు చెందిన న‌లుగురు మృతి

హైద‌రాబాద్ (CLiC2NEWS): క‌ర్ణాట‌క‌లోని హ‌ల్లిఖేడ్ వ‌ద్ద జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో తెలంగాణ‌కు చెదిన న‌లుగురు వ్య‌క్తులు మృతి చెందారు. బుధ‌వారం హ‌ల్లిఖేడ్ వ‌ద్ద వ్యాను, కారు ఢీ కొన్న ఘ‌ట‌న‌లో తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా నారాయ‌ణ‌ఖేడ్ మండ‌లం జ‌గ‌న్నాథ్ పూర్ కు చెందిన న‌లుగురు దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. వీరంతా గ‌ణ‌పూర్ ద‌త్తాత్రేయ ఆల‌యానికి వెళ్లి తిరుగు ప్ర‌యాణంలో ఉండగా ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది.

విష‌యం తెలుసుకున్న వెంట‌నే పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప్ట‌టారు. ఈ ప్ర‌మాదంలో జ‌గ‌న్నాథ్‌పూర్ గ్రామానికి చెందిన న‌వీన్ (40), రాచ‌ప్ప (45), నాగ‌రాజు (40), కాశీనాథ్ (60)గా పోలీసు గుర్తించారు. ఈ ప్ర‌మాదంలో ఒక‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

ఈ యాక్సిడెంట్‌లో కారు ముందుభాగం మొత్తం నుజ్జునుజ్జ‌యింది. గాయ‌ప‌డిన వారికి స్థానిక ఆసుప‌త్రికి త‌ర‌లించారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Also Read : ఎస్‌బిఐలో 103 స్పెష‌లిస్ట్ కేడ‌ర్ ఆఫీస‌ర్ పోస్టులు

Leave A Reply

Your email address will not be published.