పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు విద్యార్థులు మృతి
పల్నాడు (CLiC2NEWS): పల్నాడు జిల్లాలో గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని నాదేండ్ల మండలం గణపవరం సమీపంలోని బైపాస్ రోడ్డు పై ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముందుగా వెళ్తున్న లారీని వెనుకనుంచి కారు బలంగా ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు విద్యార్థులు మృతి చెందగా. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో శ్రీకాంత్, వాసు, రామిరెడ్డి, మహేష్ (నలుగురిని)లను గుర్తించారు. మరొకరిని గుర్తించాల్సి ఉంది. కాగా విద్యార్థులంతా అయ్యప్ప మాలధారణలో ఉన్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా పల్నాడు రోడ్డు ప్రమాదంపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యార్థులు మరణించడం బాధాకరమని అన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
Also Read: పుతిన్‌కు స్వయంగా స్వాగతం పలికిన మోడీ
[…] పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు … […]