పుతిన్‌కు స్వయంగా స్వాగతం పలికిన మోడీ
న్యూఢిల్లీ (): రెండు రోజుల భారత్ పర్యటనలో భాగంగా గురువారం సాయంత్రం న్యూఢిల్లీలోని పాలం విమానాశ్రయానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి పుతిన్‌ను సాదరంగా ఆహ్వానించారు. విమానాశ్రయం నుంచి పుతిన్, మోడీ ఒకే కారులో ప్రధాని అధికారిక నివాసానికి వెళ్లారు.
ఈ మేరకు ప్రధాని మోడీ ఎక్స్‌లో పోస్టు చేశారు.. “ స్నేహితుడు పుతిన్ ను స్వాగతించడం సంతోషంగా ఉంది. ఆయనతో చర్చల కోసం ఎదురు చూస్తున్నాను. భారత్- రష్యాల స్నేహం కాల పరీక్షను ఎదుర్కొని నిలిచింది.“ అని పోస్టు చేశారు.
కాగా శుక్రవారం హైదరాబాద్ హౌజ్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్ బృందంతో ప్రధాని మోడీ బృందం ద్వైపాక్షిక చర్చలను జరుపనుంది. ఈ మేరకు ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్ ముస్తాబైంది. ఈచర్చల్లో పలు అంశాలపై చర్చలు జరుపనున్నారు.
Delighted to welcome my friend, President Putin to India. Looking forward to our interactions later this evening and tomorrow. India-Russia friendship is a time tested one that has greatly benefitted our people.@KremlinRussia_E pic.twitter.com/L7IORzRfV9
— Narendra Modi (@narendramodi) December 4, 2025
Also Read : `అఖండ-2` విడుదల వాయిదా!

[…] పుతిన్‌కు స్వయంగా స్వాగతం పలికిన… […]