RRR: ‘ఎత్తర జెండా’ ఫుల్ వీడియో సాంగ్..

హైదరాబాద్ (CLiC2NEWS): ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం నుండి మరో ఫుల్ వీడియోసాంగ్ రిలీజయింది. ఈ చిత్రం నుండి ఇప్పటి వరకు ‘నాటు నాటు’, ‘కొమ్మా ఉయ్యాలా’, ‘దోస్తీ’ వీడియోలు విడుదలైన విషయం తెలిసినదే. తాజాగా చిత్ర బృందం ‘ఎత్తర జెండా’ పాటను విడుదల చేసింది. సినిమా విడుదలకు ముందే ఈ పాటకు సంబంధించిన వీడియోను రిలీజ్ చేసినా అందులో రామ్‌చరణ్, ఎన్టీఆర్, అలియా మాత్రమే కనిపించారు. ఈ కొత్త వీడియోలో దర్శకుడు రాజమౌళి, అజయ్‌దేవగణ్, ఒలివియా మోరిస్ కూడా ఉన్నారు. ఈ పాటకు కీరవాణి స్వరాలు సమకూర్చగా.. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు.