రూ. 1200 కోట్ల విలువైన డ్ర‌గ్స్ ప‌ట్టివేత‌

ఢిల్లీ (CLiC2NEWS): సుమారు రూ.1200 కోట్ల విలువైన మాద‌క‌ద్ర‌వ్యాల‌ను ఢిల్లీ పోలీస‌లు ప‌ట్టుకున్నారు. వీటిలో 312.5 కిలోల నిషేధిత మెథాం ఫేట‌మిన్‌(మెథ్‌) , 10 కేజీల హెరాయిన్ ఉన్నాయ‌ని పోలీసులు తెలిపారు. ఈ డ్ర‌గ్ రాకెట్‌ను విదేశీయులు న‌డిపిస్తున్నార‌ని.. అప్గానిస్తాన్‌కు చెందిన ముస్తాఫా స్టానిక్జా, ర‌హీముల్లా ర‌హీమ్ న‌డిపిస్తున్న‌ట్లు గుర్తించారు. విదేశాల్లో త‌యారు చేసిన ఈ మెత్‌ను ఢిల్లీకి తీసుకొస్తున్న‌ట్లు అందిన స‌మాచారం మేర‌కు ఢిల్లీ పోలీసు ప్ర‌త్యేక విభాగం అధికార‌లు కాలిందికుంజ్ మెట్రోస్టేష‌న్ వ‌ద్ద‌ వారిరివురిని అరెస్టు చేసి ట్ర‌క్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.