సాంప్ర‌దాయ పద్ధ‌తిలో సంక్రాంతి వేడుక‌లు..

మండపేట (CLiC2NEWS): వచ్చే సంక్రాంతి వేడుకలు ప్రజలు అంతా సాంప్రదాయ పద్ధతిలో జరుపుకుని కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని టౌన్ సిఐ కె దుర్గాప్రసాద్ అన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా సాంప్రదాయ సంక్రాంతి సంబరాలు పేరుతో ప్రజలకు అవగాహన‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మండపేట టౌన్ పరిధిలోని 2, 3 సచివాలయాల పరిథిలో ఉండే ప్రజలతో అవగాహణ కార్యక్రమం నిర్వహించారు. టౌన్ సిఐ దుర్గాప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. హిందూ పండుగలలో ఒకటైన సంక్రాంతి పండుగ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిరూపంగా నిలుస్తుంది అన్నారు. వచ్చే సంక్రాంతి వేడుకలు సందర్భంగా ప్రజలంతా కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని ఆకాక్షించారు. సంప్రదాయ క్రీడలు ఆడు కోవడంలో తప్పు లేదని పేర్కొంటూ పేకాట, గుండాట, కత్తి కట్టి కోడి పందేలు వంటి అసాంఘిక క్రీడలు ఆడిన, నిర్వహించడానికి ప్రయత్నించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తొలుత చిన్నారుల చేత సంప్రదాయ క్రీడల పోటీలు పెట్టి వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్సై రమణ రెడ్డి, కానిస్టేబుల్ నాగ ముని, సచివాలయ సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.