అడ్వాన్స్‌డ్ రిసెర్చ్ సెంట‌ర్ ఫ‌ర్ పౌడ‌ర్ అండ్ న్యూ మెటీరియ‌ల్ ఎఆర్‌సిఐలో సైంటిస్ట్ పోస్టులు..

Scientist posts in ARCI, hyderabad.

ARCI: హైద‌రాబాద్‌లో ఉన్న ఇంట‌ర్నేష‌న‌ల్ అడ్వాన్స్‌డ్ రిసెర్చ్ సెంట‌ర్ ఫ‌ర్ పౌడ‌ర్ అండ్ న్యూ మెటీరియ‌ల్ (ఎఆర్‌సిఐ)లో సైంటిస్ట్ పోస్టులు భ‌ర్తీ చేసేందుకు ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఖాళీల‌ను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప‌ద్ద‌తిలో ఎంపిక చేస్తారు. మొత్తం 11 పోస్టులు క‌ల‌వు. ద‌ర‌ఖాస్తులకు చివ‌రి తేదీ జులై 28.

సైంటిస్ట్ ఇ-3:

  • ఈ పోస్టులకు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు ఫిజిక‌ల్ సైన్స్‌లో డాక్ట‌రేట్ డిగ్రీ/ ఇంజినీరింగ్ / టెక్నాలజి మాస్ట‌ర్స్ డిగ్రీ ఉండాలి.
  • రిసెర్చ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ విభాగంలో ప‌రిశ్ర‌మ‌లు/ రిసెర్చ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ / సైన్స్ అండ్ టెక్నాల‌జి సంస్థ‌ల్లో ప‌దేళ్ల ఉద్యోగానుభ‌వం ఉండాలి. ఆర్ అండ్ డి ప్రాజెక్టులు, ప్రోగ్రాముల్లో ప‌నిచేసిన‌వారికి ప్రాధాన్య‌మిస్తారు.
  • సైంటిస్ట్ ఇ పోస్టుల‌కు అప్లై చేసుకునే వారి వ‌య‌స్సు 45 సంవ‌త్స‌రాల లోపు ఉండాలి.
  • ఈ ఉద్యోగానికి అప్లై చేసే అభ్య‌ర్థులు 15-20 నిమిషాల ప్ర‌జెంటేష‌న్ ఇవ్వాలి. గ‌త ఉద్యోగంలో నిర్వ‌ర్తించిన విధులు , రిసెర్చ్ ప్ర‌పోజ‌ల్ వివ‌రించ‌గ‌ల‌గాలి.
  • ఎంపికైన వారికి నెల‌కు వేత‌నం రూ. 2,38,895 ఉంటుంది. దీనికి అద‌నంగా డిఎ, హెచ్ ఆర్ఎ, ట్రాన్స‌పోర్ట్ అల‌వెన్స్‌, ఎన్‌పిఎస్‌, గ్రాట్యుటి, గ్రూప్ ఇన్‌స్యూరెన్స్‌, చిల్డ్ర‌న్ ఎడ్యుకేష‌న్ అల‌వెన్స్ , ఎల్‌టిసి, వైద్య స‌దుపాయాలు ఉంటాయి.

సైంటిస్ట్ సి-1:

  • ఎల‌క్ట్రికిల్ సైన్సెస్‌/ ఎల‌క్ట్రిక‌ల్ అండ్ ఎల‌క్ట్రానిక్స్ ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఆర్ అండ్ డి, విద్యాసంస్తలు, సైన్స్ అండ్ టెక్నాల‌జి సంస్థ‌ల్లో నాలుగేళ్ల ఉద్యోగానుభ‌వం ఉండాలి. మాస్ట‌ర్స్ డిగ్రీ చేసిన వారికి ప్రాధాన్య‌మిస్తారు.
  • ఈ పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థుల వ‌య‌స్సు 35 ఏళ్ల‌కు మించ‌కూడ‌దు.
  • ఈ ఉద్యోగానికి అప్లై చేసే అభ్య‌ర్థులు 15-20 నిమిషాల ప్ర‌జెంటేష‌న్ ఇవ్వాలి.
  • ఎంపికైన వారికి వేత‌నం నెల‌కు రూ. 1,36,405 గా ఉంది మూల‌వేత‌నంతో పాటు అద‌నంగా డిఎ, హెచ్ ఆర్ఎ, ట్రాన్స‌పోర్ట్ అల‌వెన్స్‌, ఎన్‌పిఎస్‌, గ్రాట్యుటి, గ్రూప్ ఇన్‌స్యూరెన్స్‌, చిల్డ్ర‌న్ ఎడ్యుకేష‌న్ అల‌వెన్స్ , ఎల్‌టిసి, వైద్య స‌దుపాయాలు ఉంటాయి.

 

సైంటిస్ట్ బి-7 :

  • ఫిజిక‌ల్ సైన్సెస్/ కెమిక‌ల్ సైన్సెస్‌లో మాస్ట‌ర్స్ డిగ్రీ చేసిన వారు ఈ పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.
  • డాక్ట‌రేట్ డిగ్రీ చేసిన‌వారికి ప్రాధాన్య‌మిస్తారు. రిసెర్చ్ అండ్ డెవ‌ల‌ప్ మెంట్ రంగంలో ఏడాది అనుభ‌వం ఉండాలి.
  • ఈ పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థుల వ‌య‌స్సు 35 ఏళ్ల‌కు మించ‌కూడ‌దు.
  • ఈ పోస్టుల‌ను రాత పరీక్ష‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక జ‌రుగుతుంది.
  • ఎంపికైన వారికి వేత‌నం నెల‌కు రూ. 1,14,945 గా ఉంది మూల‌వేత‌నంతో పాటు అద‌నంగా డిఎ, హెచ్ ఆర్ఎ, ట్రాన్స‌పోర్ట్ అల‌వెన్స్‌, ఎన్‌పిఎస్‌, గ్రాట్యుటి, గ్రూప్ ఇన్‌స్యూరెన్స్‌, చిల్డ్ర‌న్ ఎడ్యుకేష‌న్ అల‌వెన్స్ , ఎల్‌టిసి, వైద్య స‌దుపాయాలు ఉంటాయి.
Leave A Reply

Your email address will not be published.